Monday, 10 September 2012

ఇదేనా బ్రతుకు అర్థం..


నాకొద్దు.. మీ 
పై పై మాటలు.. మనసుతో ఆడే ఆటలు..
నాకొద్దు.. మీ 
కన్నీటి ఊటలు.. కపట ప్రేమ కోటలు..
కష్టం విలువ తెలుసంటూనే 
కష్ట జీవి కడుపు కొడుతుంటారు..
అనుబంధం ఆప్యాయత అంటూనే 
అందిన కాడికి దోచుకుంటారు..
వేదాల నీతులు పలికే మీరు 
వెర్రి వేషాలు వేస్తుంటారు..
నీతి నిజాయితీలు నిర్వచించే వారే..
అవినీతిలో కూరుకుపోతుంటారు..
ఇంకా ఎందుకు..??
మీ మనసుకు మంచి అనే ముసుగు..
సాటి వాడికి నమ్మకం అనే తొడుగు..
ఒక్క క్షణం ఆలోచించండి..
మీ మనసుపెట్టి ప్రశ్నించుకోండి..
ఇదేనా బ్రతుకు అర్థం..
మనిషి కున్న పరమార్ధం..
***********************

written by ME
at 7: 30pm 10.9.2012

No comments:

Post a Comment