నాకు నేను ఇంకా నచ్చట్లేదు..
నా జీవిత గమనమేంటో తెలియట్లేదు..
రేపేమవుతుందో అనే ఆందోళనలోనే రోజు గడిచిపోతోంది..
నిన్నలా నేడు ఉండొద్దనే ప్రయత్నంలోనే
బ్రతుకు నిలిచిపోతోంది..
కొత్త ఆశ రాదు..పాత బాధ పోదు..
నన్ను కోరి ఏ అవకాశం వెంట రాదు..
అయినా తపిస్తూనే ఉన్నా..తల్లడిల్లుతూనే ఉన్నా..
నన్ను నాలా చూపే రోజు కోసం
ఎదురుచూస్తూనే ఉన్నా..
అయినా,
ఒక్కో క్షణం నా నుండి జారిపోతుంటే.
ఒక్కో మనిషి నన్ను విడిచిపోతుంటే,
ఒంటరి నై, ఓటమి నై
మారా నేను ఇపుడు దురదృష్టానికి చిహ్నంలా
అదృష్టానికి అంటరాని వాడిలా..
**********************
written by ME
at 12:51pm 24.7.2012

thnq
ReplyDeleteu showed me to me in ur poem