Thursday, 28 June 2012

ఆ సూర్యచంద్రుల ముద్దు గాథ..


ఇదొక అందమైన ప్రేమకథ..
అందరికీ అందని ఆ చంద్రవంక ప్రేమకథ..
సూరీడునే వలచిన ఓ చిన్నదాని ప్రేమకథ..   
తన వేడినే వెన్నెలగా మలిచిన ఓ ముద్దుగుమ్మ ప్రేమకథ..

ప్రేమకి ఏ దూరం అడ్డురాదని. .
ఆరాధనకి ఏ ఆకారం పోటీ కాదని..
మనసుకి ఏ భాష అక్కర్లేదని..
మమతకి ఏ స్వార్ధం ఉండరాదని..
            చెప్పే...
రెండు మూగ బాసల ముచ్చటైన ప్రేమకథ..
ముల్లోకాలకి వెలుగు పంచె  
ఆ సూర్యచంద్రుల ముద్దు గాథ..

కాలానికి లొంగక..
కావ్యానికి అందక..
సాగిపోతున్న ఓ స్వచ్చమైన ప్రేమకథ..
బాధ్యతలని మరువక..
భారంగా గడుపక...
మనముందు నిలిచిన ఓ సత్యమైన మధుర కథ
*******************************
written by ME
at 11:35pm 28.6.2012

No comments:

Post a Comment