ఎంత మంచి దానివి అమ్మ..
ఆకలేస్తే అరటి పండు ఇచ్చావ్..
కోపమొస్తే కొబ్బరి చిప్ప విసిరావ్..
ప్రేమనిపిస్తే పెరటి దారులు చూపావ్..
ముద్దనిపిస్తే ముంత మావిల్లు ఇచ్చావ్..
గారంగా చంకనెత్తుకొన్నావ్..
భారంగా కొమ్మలెక్కావ్...
గుళ్ళో ప్రసాదాన్ని..
ఇంట్లో ఆహారాన్ని...
మనుషుల కళ్ళు గప్పి..
మన తోటోళ్లకి సోది చెప్పి..
నాకోసం తెచ్చావ్..కదా అమ్మ..
ఏనాడైనా నువ్వు
కడుపునిండా తిన్నావో,లేదో గాని..
నా బొజ్జనెపుడూ ఖాళీగా ఉంచలేదు..
నా పళ్ళకెపుడూ విరామం ఇవ్వలేదు..
ఎంత మంచిదానివి అమ్మ..
************************
written by ME
at 12pm 24.6.2012
No comments:
Post a Comment