Monday, 25 June 2012

నిలవనీ..ఈ సుఖమే నాదిగా..

ఎగరనీ... ఊహల రెక్కల తోడుగా..
నీ చెంతకు చేరే జాడగా..
కరగనీ..మన మధ్య దూరం క్షణముగా..
కలతలు వీడే ఘడియగా..
పిలవనీ..ప్రతి జంట పక్షిని సాక్షిగా..
జతపడే మనసుకే దీవెనగా.. 
నిలవనీ..ఈ సుఖమే నాదిగా..
నీ కౌగిట మురిసే చెలియగా..
**********************
written by ME
at 9:55am 25.6.2012

No comments:

Post a Comment