Wednesday, 20 June 2012

మనసెప్పుడో అంకితమైనది..

నిను వదిలి ఏ నిమిషమైనా నిలువగలనా జాణా..
ఆ మృత్యువే నాకై పొంచి ఉన్నా.. నీ తోడై నేను రానా..

మాట కాదే ఇది మరిచేందుకు..
నా మానస సుస్వర వీణ..
మనసెప్పుడో అంకితమైనది..
నీ మృదు కోమల స్పర్శలోన..

కల కాదే ఇది కలవరపడకు కూన 
అలలై ఎగసే నాలో ప్రేమ చానా..
నమ్మకముంచవే కాస్తా నాపై ఆన..
నీ నవ్వుకై ఆ నింగినైనా 
నేల దించలేనా...
***********************
written by - బొడ్డు మహేందర్
at 9.30pm 20.6.2012

No comments:

Post a Comment