Friday, 1 June 2012

జయహో...భారతమా....


ధనం విలువ పెరగొచ్చు..తగ్గొచ్చు..
కానీ ఆశ...అత్యాశ ఇంకా అలానే ఉన్నాయి..
అవసరాలు తగ్గొచ్చు..పెరగొచ్చు..
కానీ అవినీతి...ఆక్రమణ ఇంకా అలానే ఉన్నాయి..

విలాసాలని విచ్చలవిడిగా ఉంటూ..
అందిన కాడికి అప్పనంగా దోచేస్తూ..
చట్టం చుట్టమని , న్యాయం నేస్తమని..
తేల్చేసిన ఘనులెందరో..
తెగబడిన జడ్జీలు ఎందరో...


ధనం ముందు 
మహాజనమైనా..మామూలు మనిషైనా..
చిత్తవ్వాల్సిందే..చిత్తం అనాల్సిందే..

అసలే పేద దేశం..ఆపై ఆకలి రాజ్యం..
నోట్ల కోసం నోర్మూసుకోవడం..
ఓట్ల కోసం నోరు పారేసుకోవడం..
ఇక్కడ సామాన్య విషయం..

మహాత్ముడో..మహానుభావుడో..
గొంతెత్తినపుడు తోక ఊపుతాం..
గొంతుదాకా వచ్చినప్పుడు తల తిప్పుతాం..

జయహో...భారతమా....
జగమే అవినీతికి వశమా...
********************
written by ME
at 11:30am 2.6.2012

No comments:

Post a Comment