నా ప్రేమ విషయం నీకు చెప్పలేదు..
లేనప్పుడు నిన్ను మరువలేదు ..
నా మనసెప్పుడూ నిను విడువలేదు..
కలిసే ఉంటాం కదా అనుకున్నా
కలగా వచ్చావని ఎరుగలేకున్నా..
నీతోనే సమస్తం అని నిశ్చయించుకున్నా
నీవే లేక శూన్యమై ,ఒంటరిగా మిగిలున్నా..
చినుకై, చిగురాకై నువ్వెప్పుడొస్తావో..,
నీడనై, నీదాననై నేనెప్పుడు నడుస్తానో..,
కన్నీరింకిన కనులతో కలలు కంటూనే ఉన్నా,
ఓ క్షణమైనా నీ ఒడిని చేరి మురవాలనుకుంటున్నా
*************************
written by ME
at 1:15pm 19.4.2012
చాలా బాగుంది కవిత...మంచి feel ఉందండి
ReplyDelete