Friday, 6 April 2012

మాయ చేసి బ్రతక లేక


ఎప్పుడూ..అదే వాదన..అదే వేదన..
నాలో..నాకు,  నా మనసుతో నాకు..
మాయ చేసి  బ్రతక లేక,
మనసు విరిగి ఉండలేక,


ప్రేమిస్తానన్న ప్రేయసి లేదు,
ప్రాణమిస్తానన్న స్నేహం లేదు,
రేపు ఏమవుతుందోనన్న క్షోభ లేదు..
నాకై నిలిచే ఏ బంధం లేదు..


కాని అంతరాంతరాలలో 
ఏదో ఒక చిన్న ఆశ 
అపుడపుడు కవ్విస్తుంది కొంటెగా,
కాంక్ష రేపి,
కన్నీటినే మిగులుస్తుంది రివాజుగా..


అందుకే జగమంత కుటుంబమైనా
నేనెప్పుడూ ఒంటరిగానే ఉన్నా,
మనసెంత విశాలమైనా
మౌన మునిలా నిశ్చలంగా ఉన్నా..
ఏ ఒక్కరికీ చోటివ్వలేకున్నా..
******************
written by ME
at 1:43pm 6.4.2012

No comments:

Post a Comment