Monday, 2 April 2012

అంకితం..

ఒక హృదయం కోసం తపించి,
తరిగిపోయింది జీవిత కాలం..
ఒక రూపసి కోసం జపించి,
ముగిసిపోయింది ఈ యవ్వనం..
అయినా..ఎందుకో,
ప్రేయసి పై ఆశ చావలేదు..
తన ప్రేమ పై నమ్మకం సడలలేదు ..
విధి వంచించి వేరు చేసినా ,
మది ఏడిపించి ఒంటరిగా మార్చినా..
ఈ ప్రేమ శాశ్వతం..
నా జన్మ దానికే అంకితం..
*****************
written by BODDU MAHENDER
at 12:16am 3.4.2012.

No comments:

Post a Comment