Wednesday, 25 April 2012

ప్రేమా..! ఎందుకే

దొరికింది అనుకున్నా..
దోబూచులాడుతూనే ఉంది..
కలగానే మిగిలి 
నను కలవరపెడుతూనే ఉంది..
ప్రేమా..! ఎందుకే నాతో ,ఈ చెలగాటం 
ప్రేమించే హృదయానికి నిత్యం ప్రాణ సంకటం 


మనసిచ్చావు..మాట ఇచ్చావు..
మనువాడే వేళ , మనిషే లేకుండా పోయావు..
ప్రాణం అన్నావు.. ప్రణయం అన్నావు..
ప్రళయమై ఇపుడు, నువ్వే నను ముంచేశావు..


నమ్మకానికి ఇపుడు ద్రోహం చెదలు పట్టింది..
నా అనే బంధానికి మోసం తెగులు సోకింది..
కన్నీటి చుక్కల శబ్దంలో కాలమే తెలియట్లేదు..
హృదయ లయల స్వరంలో నా ప్రాణమే నిలవట్లేదు..


నరాలని నాదంగా చేసి పలికిస్తున్న ఈ స్వరాలని..
నరకాన్ని కానుకగా ఇచ్చిన ప్రేయసి మురిపాలని..
***************************
written by ME
at 12:30pm 25.4.2012

No comments:

Post a Comment