ఉప్పెంగే లావా లా నాలో వేదనలు ఎగిసిపడుతున్నాయి..
ఊరడించే హృదయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి..
పుట్టాక, తెలియని బాధ
పెరుగుతుంటే నరకాన్నే చూపెడుతోంది..
తగ్గే సూచన లేక అది అరణ్య రోదనే అవుతోంది.
ఏడ్చి ఏడ్చి ఎడారి అయింది నా నయనం
కాటి దారుల్నే వెతికింది నా జీవిత పయనం
అందమెంత ఉన్నా, ఆదరించే మనసు లేదు ఎవరికీ,
ఆరాధించే వారున్నా,ప్రేమించే స్థితి లేదు నా మనసుకి..
నేనేం చేసానో పాపం..
విధి పెట్టింది ఈ శాపం..
అందరేమో ఊహా లోకంలో ఆశలతో నిచ్చెన వేస్తుంటే,
నేనేమో నిస్పృహల పాతాళానికి మెట్లు కడుతున్నా ..
అన్నీ ఉన్నా ఏమీ లేని దాన్నయా..
అపహాస్యం చేయడానికి మీకో ఆటబొమ్మనయ్యా...
జాలి లేని దైవమా..నన్నెందుకు పుట్టించావు..
కఠినమైన ఆంక్షలతో నన్నెందుకు బ్రతికించావు..
కన్నీరైన కార్చే స్వేచ్చ లేదు..
క్షణమైనా నవ్వే వీలు లేదు..
విషాద వనంలో నేనో ఎండిన మావిని ..
వికసించ కుండానే వాడిపోతున్న గడ్డి పువ్వుని..
*****************************
written by ME
at 8:49pm 23.04.2012

No comments:
Post a Comment