Thursday, 22 March 2012

నందన నామ సంవత్సరానికి ప్రారంభం ఇది.

తెలుగు లోగిల్లన్నీ నేడు తోరణమయమయ్యాయి..
ఇళ్ళ వాకిల్లన్నీ రంగవల్లులతో నిండాయి.
కోయిల స్వరంలో కొత్త పాట పల్లవించగా..
మామిడి పిందెల గుత్తులు వేడుకలు జరుపుతున్నాయి..

కాలాన్ని ఖండించి,
వసంతాన్ని వరుసలో ముందుంచి,
సంతోషాన్ని సాదరంగా 
పిలిచే సమయం ఇది.

ప్రకృతిని పూజించి,
పచ్చడిని సేవించి,
పంచాంగాల ఫలితాల కోసం
పరుగులు పెట్టె సందర్భం ఇది.

ఆది,అనాదుల ఆచారం ఇది.
ఆంధ్రుల కాలమాన వ్యవహారం ఇది.
ఉగాది ఉత్సవాల సంరంభం ఇది.
నందన నామ సంవత్సరానికి ప్రారంభం ఇది.
***********************
written by ME
at 6:35am 23.3.2012

స్నేహితులకి,ఆత్మీయులకి, వీక్షకులకి,అభిమానులకి,
నా ఉగాది శుభాకాంక్షలు.

No comments:

Post a Comment