Wednesday, 28 March 2012

నీ చుర చుర చూపులే పంజా... పంజా (2011)

పల్లవి:
నీ చుర చుర చూపులే పంజా
సల సల సల ఊపిరే  పంజా
నర నరమున నెత్తురే పంజా
అణువణువునా  సత్తువే పంజా
అలుపెరగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజా
పెదవంచున మౌనమే పంజా
పదునగు ఆలోచనే పంజా

చరణం:
హే  చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి 
తప్పదనే యుద్దముగ వేకువ చూడదా రేపటి కాంతి
ఆకాశం నీ పంజా
అది  గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా
చరణం: 
ఆటుపోటు లేనేలేని సాగరమే ఉంటుందా
ఎత్తుపల్లం లేనేలేని రాదారంటూ ఉందా
ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా
ఏదేమైనా తుదివరకు ఎదురీత సాగాలిగా..

హే  అడుగడుగు అలజడిగా నీ జీవితమే నీ శత్రువు కాగా
బెదిరించే  ఆపదనే ఎదిరించే గుణమేగా పంజా

ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చెడునంతం చేసే  చైతన్యంగా 

చిత్రం: పంజా (2011)
రచన: రామ జోగయ్య శాస్త్రి 
సంగీతం,గానం : యువన్ శంకర్ రాజా

No comments:

Post a Comment