Thursday, 5 January 2012

"నా" అనుకున్నదే గుండె కోసి

నా నవ్వుల మాటున నేను పడుతున్న 
ఈ నరకయాతన ఎవ్వరికి తెలుసు ..?
ఈ హంగుల  చాటున  నలిగిన
నా హృదయ వేదన ఇంకెవ్వరికి తెలుసు ..?

నోరు తెరిచి నేను అడగలేను 
నోర్మూసుకొని ఉండలేను 
వదలకుమా అని బతిమాడలేను..
 వదిలిపోతే బ్రతికి ఉండనూ లేను ..

కంటిపాప కునుకు మరిచెను 
కన్నీరు కలలను తుడిచెను..
అనుకున్నదే జరిగినదని 
ఎత్తి పొడిచెను ఈ లోకం ..
"నా" అనుకున్నదే గుండె కోసి 
మిగిల్చెను శోకం....
**************************
written by ME
at 2:36 am, 6.1.2012.


 

No comments:

Post a Comment