Saturday 3 December 2011

"మట్టిలో మాణిక్యం" సినిమా లోని "రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్" అనే పాటకి పేరడీ :




పల్లవి :
రిమ్ జిమ్ రిమ్ జిమ్ ఆదిలాబాద్ 
కొమరం భీమ్ జిందాబాద్ 
కలిసి కట్టుగా డెవలపు చేస్తే.. నగరాలన్నీ బలాదూర్ ..

చరణం : 
అటు చూస్తే బాసర క్షేత్రం ..
ఇటు చూస్తే కుంటాల పాతం 
ఆ వంక నిర్మల్ బొమ్మలు 
ఈ వంక గుస్సాడీ డాన్సులు 
గల గల పారే .. గల గల పారే గోదారి చందం 
చూస్తే ఎంతో అందం ...
                                                                      "రిమ్ జిమ్ రిమ్ జిమ్"
చరణం :
ఒకవైపు గిరిజన దండు 
మరు వైపు హరిజనం మెండు..
చెన్నూరు లో ఉత్తర వాహిని 
తుమ్డి హెట్టి లో ప్రాణహిత నది 
కొండలు కోనలు  అరణ్యాలతో.....
వన దేవత యే మురిసే..
                                                                    "రిమ్ జిమ్ రిమ్ జిమ్"
చరణం :
గనులున్నా పనులే లేవు ..
వనరులున్నా వాడుక లేదు ..
నీరు లేక బీడయ్యే భూములు..

విద్య లేక లోకువయ్యే జనులు ..
ప్రగతి పథం లో నడిచే రోజు ...
ఎపుడొస్తుందో .. ఏమో..???
                                                                      "రిమ్ జిమ్ రిమ్ జిమ్"
*************************************
written by ME,
at 7:30pm 6.6.2011
*************************************
ఈ  పేరడీ  పాట  సూర్య  పేపర్  ఆదివారం  సంచికలో 
జులై 10 ,2011 నాడు ప్రచురితమైనది .........

No comments:

Post a Comment