Saturday 3 December 2011

"నువ్వు నాకు నచ్చావ్" సినిమాలోని "నా చెలియ పాదాలు " అనే పాటకి పేరడీ :



నా  చెలియ  పాదాలు ..ఏనుగుకే పాటాలు..
తాను పలికితే చాలు సృష్టి అతిపాతాలు  

పల్లవి:
ఓ నవ్వు చాలు ఎంతెంతో వణుకు వస్తూ అల్ల్లుకుంటుంది 
తనువంత దిగులు ..మనసంత గుబులు నాలో చొచ్చుకుంటుంది
ఆ దొంగ కళ్ళ ఓ లుక్కు చాలు ..పరుసే నిలువనంటుంది ..
షాపుల్ల లోని గిఫ్టు లు గా మారి ...నన్నే ఏడిపిస్తోంది.
పట్ట పగలెవరైనా.. రాక్షసి ని చూసారా ...?
తన రూపు చూపిస్తా ..భయపడక చస్తారా ..?
                                                                               "ఓ నవ్వు చాలు "
చరణం :
గుండెల్లో గుడ్లగూబ లా ....ఎండల్లో ఎండు మిరపలా 
కొండల్లో కొండ చిలువలా..పాకుతున్న లయలో..
గుమ్మం లో దిష్టి బొమ్మలా..కొమ్మల్లో కొండ ముచ్చులా 
మల్లెల్లో మసి బొగ్గు లా ...ఆమెకెన్ని హొయలో..
అలా నడిచి వస్తుంటే గుంతల మయం 
బలై పోనీ మనిషుంటే మనిషే అనం ....
                                                                       ." ఓ నవ్వు చాలు "
**********************************************
written by ME,
at 7pm 10.1.2011
**********************************************
ఈ పేరడీ పాట సూర్య పేపర్ ఆదివారం సంచికలో ,
జనవరి 30 ,2011  నాడు ప్రచురితమైనది

 

No comments:

Post a Comment