Sunday 4 December 2011

నూతన సంవత్సర శుభాకాంక్షలు ..

తమస్సంచ్చన్న మైన ఈ జగత్తుకు 
ఉద్యద్ధ్వాంతారాంతి  ప్రభుండు  తన
మయూఖ రేఖలచే నవ మహోదయాన్ని
సాక్షాత్కరించే శుభ సమయాన
భావంబున వెల్లి విరిసిన నూతనోత్సాహంతో
చిరు మోవి పై చిరు నగవులు చిందిస్తూ ..
కోటి స్వప్నాలతో వాకిట నిలిచిన
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే
పరమ హృష్ట మైన  ఈ క్షణాలు
అంతః కరణంబున ఎల్లవేళలా నిల్చి యుండాలని
ఈ నవోదయం మన జీవితాలకి
ఒక శుభోదయం కావాలని
జగమంతా శాంతి కాముకతో
ప్రగతి పథాన పురోగమించాలని ఆకాంక్షిస్తూ
మన ఇరువురి స్నేహ బంధం
విడదీయరాని మధురాను బంధంగా
కలకాలం నిలిచిపోవాలని కోరుకుంటూ ..
తెలుపుతున్నా మీకు ..నూతన సంవత్సర శుభాకాంక్షలు .. 

********************************************************
ఈ కవిత వార్త పేపర్ ఆదిలాబాద్ జిల్లా ఎడిషన్ లో
11 .2 .2002   నాడు ప్రచురితమైనది......

No comments:

Post a Comment