Sunday 4 December 2011

నా మనసు గోడు వినవా అంటూ ...

హుస్సేన్ సాగర్  తీరాన సంధ్యా సమయాన నెక్లెస్ రోడ్ పార్కు లో...
లేక్  వ్యూ  సైడు  బెంచీ లో.. 
మాటలు కలుపుతూ ..చూపులు   విసురుతూ..

కరుగుతున్న ఐస్ క్రీం ఒకవైపు ...
కర్పూరమవుతున్న కాలం మరోవైపు ....
ఈ సందడిలో ..యెద తొందరలో...
 

మూట   గట్టిన   భావాలకి  ముచ్చటైన రూపునిచ్చిన ఒక యానిమేటెడ్ గ్రాఫిక్స్  సీడీ ( ఆమె ఫొటోస్ తో నా వీడియో క్లిప్పింగ్స్ ని జత చేసి ఓ అందమైన దృశ్య కావ్యం గా  మలిచినది ) , ఆ పక్కనే వజ్రపు మెరుపుల్లో వర్ణ శోభితంగా విలసిల్లే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంగరం , ఈ రెండింటిని కప్పుతూ గులాబీ రెక్కలపై గుండె పదనిసలని ఏర్చి కూర్చిన నా కవితలు .........
ఇలా ఈ మూడింటిని పొందికగా ,అందంగా అమర్చిన  ఓ హృదయాకారపు గిఫ్ట్ బాక్స్ ని నా తొలి వలపుకి కానుకగా 
ఇస్తూ ...

మది  కోరిన మగువా ..
నా మనసు గోడు వినవా అంటూ ...
చెప్పకనే చెప్తాను ...
చెలియా నిన్ను ప్రేమిస్తున్నాను అని..
 ****************************
ఇది 2008 లో   ఫిబ్రవరి  14  వాలెంటైన్స్ డే ( ప్రేమికుల రోజు ) సందర్భంగా "ఆంధ్ర జ్యోతి " దిన పత్రిక వారు నిర్వహించిన ఓ కాంటెస్ట్ లో నాకు ప్రోత్సాహక బహుమతిని తెచ్చి పెట్టిన నా అందమైన ఊహ ..
ఇది 2008 ఫిబ్రవరి 14 నాడు ఆంధ్రజ్యోతి దిన పత్రిక లో ప్రచురితమైనది ...

No comments:

Post a Comment