Tuesday 29 November 2011

ఈమె మా అమ్మ......

నీ  చూపులెప్పుడూ ,
నను  తడుముతూనే  ఉన్నాయమ్మా ..
నువ్వే  నా   చివరి  ఆశ  అంటూ ,
గుర్తు  చేస్తూనే  ఉన్నాయమ్మా ..
నీ  నవ్వులెప్పుడూ ,
నను  పలకరిస్తూనే  ఉన్నాయమ్మా ..
నా  నవ్వుల  కారణం ,నువ్వేనని ..
నాతో  చెప్తూనే ఉన్నాయమ్మా ...


అమ్మా .....
నాకు  అన్నం  పెట్టాలని ,
నువ్వు  అర్ధాకలితో  గడిపావే ..అమ్మా
నాకు  కొత్త  బట్టలు  కొనాలని ,
నీ  ఆశలని  చంపుకున్నావే ..అమ్మా ..
నా  కోరికలు  తీరాలని ,
నువ్వు   మొక్కులు  మొక్కావు ..కదమ్మా .
నా  గెలుపు  కోసమని
నీ బ్రతుకంతా  యేడ్చావే ...అమ్మా ..
నన్ను  నిలబెట్టాలని ,
నువ్వు  క్రుంగిపోయావ్ ..కదామ్మా


అమ్మా ...
నీ  దీవేనొక్కటి  చాలమ్మా  ..
వేల  అడ్డంకులనైనా  అధిగమిస్తానమ్మా ..
నీ  ప్రేమ  స్పర్శ  చాలమ్మా ..
లక్ష  లక్ష్యాలనైనా ..
నీ  ముందు  నిలుపుతానమ్మా ..


అమ్మా ..
నీ  కన్నీటిని ,
ఆనంద భాస్పాలుగా  చూసే  రోజు ,
మరెంతో  దూరం  లేదమ్మా ..
మా  అమ్మకి  పాలాభిషేకం  చేయడానికి ,
అది  ఎదురు  చూస్తోందమ్మా  ..
గుండె  గొంతుకలోక్కటి  చేసి ,
అరవాలని  ఉందమ్మా ..
ఈమె  మా  అమ్మ  అని
సగర్వంగా  చాటాలని  ఉందమ్మా ..
ఈమె  మా  అమ్మ అని
సగర్వంగా  చాటాలని  ఉందమ్మా ..
***************************************************


written by ME,
at 9:17am, 22.11.2011
***************************************************
The super most example of Love in My Life:
" when apples were 4 & we were 5,
then my mother said-
I don't like apples.. ".
****************************************************
For the best mom..
Who always had a smile for me.
I know we may be far apart right now...
So here is a great big hug and kiss.

No comments:

Post a Comment