నిశి రాత్రి అలుముకుంటే ,
మలి వేకువ లేపింది ..
నిశబ్దం విసిగిపోయి ,
వలపు కేక వేసింది ..
నాలో దాగిన ఊహలు ,
రెక్కలు విప్పి ఎగిరాయి ..
స్వేచ్చా విహంగాలై,
సృష్టి అందాల్ని చుశాయ్i..
కీచురాళ్ళ శబ్దం ,
కొత్త స్వరం వినిపిస్తోంది ..
గుండె లయతో జత కూడి ,
ప్రేమ పాట పాడుతోంది ..
మెరుపు వలె మెరిసిన నీ రూపు ,
కోటి తారల వెలుగిస్తుంటే ,
సర్రున తాకిన చిరుగాలి ,
నీ చేతి స్పర్శని తలపిస్తుంటే ,
అంతులేని అగాధాల మధ్య ,
చేస్తున్నా .. ఆనంద కేళి ..
అరక్షనమైనా చాలు ,
ఈ అనుభూతుల రవళి ..
ఆ ప్రేరణతోనే మొదలెట్టింది నా పాళీ ,
మీ కళ్ళముందున్న ఈ జావళి ....
**************************
***
written by ME,
at 11:43pm, 14.11.2011.
**************************
No comments:
Post a Comment