Saturday 5 July 2014

యువకవి తోకల రాజేశం

ఈరోజు నా ప్రయాణం మా ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ యువకవి తోకల రాజేశం Rajesham Thokala ఇంటివైపు సాగింది. ఆదిలాబాద్ జిల్లాలోని కవులందరి ప్రొఫైల్ వివరాలు సేకరిద్దామని వెళ్లాను. ఆయన ఉండే ఆవడం కి నేను పోవడం తొలిసారి కాబట్టి దారిలో అనేకమందిని దారి అడుగుతూ వెళ్ళాల్సి వచ్చింది. అలాగే ఆవడం చేరుకున్నాక ఆయన ఇంటికి దారి వెతకాల్సి వచ్చింది. అయితే ఆ వూరి లో ఎంటర్ అయినప్పటి నుండి నేను అడిగిన ప్రతీ వ్యక్తీ చిన్నా పెద్దా తేడా లేకుండా ఆయన గురించి చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది, మన వాడి పాపులారిటీ చూసి. ఒకే వీధిలో ఉన్న వాళ్ళ పేరే చెప్పడం కష్టం అయిన ఈ తరుణంలో ఇలా అందరూ తనను గుర్తించడం తన ప్రతిభకి దక్కిన నిజమైన గౌరవంగా నేను భావించాను. నేను వస్తున్నాను తెలిసి నాకోసం వారి వీధిలో ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పటికే. ఆయన ఇంటికి వెళ్ళాక తన దగ్గర ఉన్న పుస్తకాల కన్నా(కనీసం 3000పుస్తకాలు) తన మెదడులో నిక్షిప్తమైన సమాచారమే ఎక్కువ అని అనిపించింది. ఏదో అరగంట/గంట అనుకున్న సమావేశం కాస్తా సాయంత్రం నాలుగు వరకి సాగింది. సాహిత్యం గురించి, సాహితీ మిత్రుల మనస్తత్వాల గురించి అనేక కొత్త విషయాలు చెప్పారు. వారి ఊర్లోని రామాలయం కి తీసుకెళ్ళి దాని పూర్వాపరాలు చెప్పారు. అలాగే లంచ్ టైం లో నాకోసం ప్రత్యేకంగా చికెన్ తో వంట చేయించి భోజనం పెట్టారు. చాలా కొత్త అనుభూతులతో గడిచింది ఈ రోజు. ధన్యవాదాలు మిత్రమా .

No comments:

Post a Comment