Thursday 3 April 2014

మా తెలుగు మాస్టారు రేవెల్లి రామయ్య గారు

ఈయనే మా తెలుగు మాస్టారు రేవెల్లి రామయ్య గారు. నేను చెన్నూరు లో చిన్న మున్షి జూనియర్ కాలేజీ లో ఇంటర్మీడియేట్ చదివినప్పుడు మాకు తెలుగు బోధించేవారు. పద్యాలను రాగయుక్తంగా, భావయుక్తంగా పాడి మాలో తెలుగు సాహిత్య జిజ్ఞాసను పెంచే వారు. తెలుగు రక్షణ వేదిక ప్రతినిధిగా నేను ఈరోజు ఆయనని కలిసినప్పుడు ఆయన పొందిన సంతోషం అంతా ఇంతా కాదు. నా ముందే అయన సహాధ్యాయులు, కవులకి ఫోన్ చేసి నా గురించి చెప్పారు. ఆ చెప్పే విధానంలో ఆయనలో తొణికిసలాడిన గర్వం నన్ను ఆశ్చర్య చకితుణ్ణి చేసింది. కానీ పక్షవాతం కారణంగా ఆయన నేను ఆహ్వానించిన సన్మాన కార్యక్రమాలకి రాలేకపోవడం ఒకింత బాధగా అనిపించింది. ఏది ఏమైనా చాలా సంవత్సరాల తర్వాత మా మాస్టార్ ని కలవడం రెండు గంటలకి పైగా గత స్మృతులని గుర్తుకు తెచ్చుకోవడం.. ఈ సందర్భంగా ఆయన రాసిన రెండు పుస్తకాలని నాకివ్వడం సంతోషంగా అనిపించింది. దేవుడి దయ వల్ల ఆయన ఆరోగ్యం బాగుపడి నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను.

No comments:

Post a Comment