Saturday 21 September 2013

మన సంస్కృతిని నిలుపుతున్న ఓరుగల్లు

ఆ పేరులోనే ఉంది విప్లవ సంగీత ఝరి
ఆ రాజ్యాన్ని ఏలింది ఓ వీర రుద్రమ నారి
పేరిణీ తాండవం అయినా.. పెంబర్తి కళ అయినా
  రామప్ప శిల్పం అయినా..  రాజకోట తోరణం అయినా
అది కళలకే  అపర కాణాచి..
కళాకారులకి పరిచే ఎర్ర తివాచీ..
సమ్మక్కలా సమరశంఖం పూరిస్తుంది..
కాళోజీలా కదన కావ్యాన్ని రచిస్తుంది..
అది జన గొంతుకలు ఒక్కటైన తెలంగాణా జాతర
మన సంస్కృతిని నిలుపుతున్న ఓరుగల్లు మాతరా..
**********************************
written by BODDU MAHENDER
at 11:14pm 21.9.2013

No comments:

Post a Comment