Monday 19 August 2013

ప్రేమంటే పొందడం కాదు

అందడని తెలిసినా 
ఆశ చంపుకోదు సూర్యకాంతం
అనునిత్యం ఆరాధిస్తూనే
వేచిచూస్తుంది జీవితాంతం
కన్న కలలు కన్నీళ్ళే మిగిల్చినా
ఎండమావులు ఏమరుపాటు కల్గించినా
తలపుల వానల్లో తరించిపోతుంది.
తన కాంతి స్పర్శల్లో పులకించిపోతుంది.

ప్రేమంటే పొందడం కాదు మరి,
అనుభూతి చెందడం.
ఆ ఆర్తితోనే, 
అనుక్షణం గడపడం
అనురాగం చూపడం.
****************************
written by BODDU MAHENDER
at 1:05am 20.8.2013

No comments:

Post a Comment