పల్లవి :
కళ్ళల్లోన నిను దాచానే కన్నమ్మా
కనురెప్పల నయనా ముయగా లేనే చిలకమ్మా
కలకాలం నువ్వు జీవించాలే చిట్టమ్మా
అరే..నీవు వుంటే సంతొషం, నీవేగా నా ప్రాణం
నీ వాడే పలుకులొ, వున్నాదే సంగీతం
నీ పువ్వు లాంటి నవ్వులు చాలే చిన్నారి
నువ్వు లేని నాడు నేను ఉండనే బంగారి...
చరణం : 1
మనుషులనే చదువుతున్నా..
మనసున ప్రేమే పెంచుకున్నా..
ఊహాలలో బ్రతుకుతున్నా..
నీకోసమే నా ప్రాణమన్నా..
నాకోసమే నిన్ను పంపాడే ఆ దైవం
ఇక మౌనం మాని కన్నమ్మా చిరునవ్వులు కురిపించు
నీ నాలో నేనే చిన్నమ్మా నా బాధని గమనించు..
కళ్ళల్లోన నిను దాచానే కన్నమ్మా
కనురెప్పల నయనా ముయగా లేనే చిలకమ్మా
కలకాలం నువ్వు జీవించాలే చిట్టమ్మా
చరణం : 2
దుఖం అన్నదే తొలగిపోయినా
నిన్ను చూసి మరలా మరలి వచ్చెనే
చీకటింటిలో వెలుగు దివ్వెలా
వసంతాలే కళ్ళల్లో విరబూసేనే
అంతులేని దుఖంలో ఆశలాగా వచ్చావే
ఇక దొరకదు అన్న సంపదలే నువ్వు మరలా తెచ్చావే
నా మనసున ఆశలు కురిపించి నా ప్రాణం నిలిపావే ..
కళ్ళల్లోన నిను దాచానే కన్నమ్మా
కనురెప్పల నయనా ముయగా లేనే చిలకమ్మా
కలకాలం నువ్వు జీవించాలే చిట్టమ్మా
అరే.. నీవు వుంటే సంతొషం, నీవేగా నా ప్రాణం
నీ వాడే పలుకులొ, వున్నాదే సంగీతం
నీ పువ్వు లాంటి నవ్వులు చాలే చిన్నారి
నువ్వు లేని నాడు నేను ఉండనే బంగారి...
చిత్రం : ప్రేయసీ నన్ను ప్రేమించు (2000)
సంగీతం : S.A.రాజ్ కుమార్
రచన : భువనచంద్ర
గానం :
ఈ పాటకి తగిన ఫోటోలతో నేను ఎడిట్ చేసి రూపొందించిన వీడియో..
***********************************
created by BODDU MAHENDER
at 1:40pm 6.12.2012
No comments:
Post a Comment