ఎందుకు నేనెవరికీ నచ్చట్లేదు..
నా మనసెవరికీ అర్ధమవట్లేదు..
నిజాలు పలికితే నిష్ఠూరమాడుతారు..
నిష్కల్మషంగా మెలిగితే నడ్డి విరిచిపోతారు..
నా కళ్ళకి తడి , గుండెకి అలజడి
కోరుకున్నదాని కోసం, నే పడే హడావిడి
ఏ ఒక్కటైనా.. ఈ రోజుకీ తగ్గలేదేం..??
నా మౌనంలో మాట మీ మనసు చేరలేదేం..??
మీ వెక్కిరింతలు, ఈసడింపులు నాకేం కొత్త కాకపోయినా,
ప్రేమ పలకరింపులు, దాని కలవరింతలు కావాలని,
నా గుండె చేసే ఘోషని ఒక్కసారైనా కనలేరా..?
కరుణించి మీ దరికి చేర్చుకోలేరా..?
ఓ క్షణమైనా నాకు బాసటగా నిలవలేరా..??
*******************************
written by BODDU MHENDER
at 3:15pm 11.12.2012

No comments:
Post a Comment