నిజం..నాకు స్నేహం అంటే నచ్చదు..
లేని అభిమానాల్ని రుద్దుకొని మెలగడమంటే నచ్చదు..
కపట బుద్ధులతో కవ్వించడం అస్సలు నచ్చదు..
నమ్మించి నట్టేట ముంచేయడం ఇంకా నచ్చదు..
నా మనసుని నేను చంపుకోలేను..
ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకోలేను..
కల్లిబొల్లి కబుర్లతో మభ్యపెట్టలేను..
నాకు నచ్చిందే చేస్తాను..
నచ్చిన వాళ్ళతోనే జీవిస్తాను..
ఏ బంధం శాశ్వతం కాదని తెలుసు..
సాయం అనే మాటే లేకుంటే స్నేహమనే మాట కూడా
ఈ జగతిలో ఉండదని ఇంకా తెలుసు..
అందుకే నాకు స్నేహం నచ్చదు..దాని పేరుతో..,
అవకాశావాదులని నెత్తినెక్కించుకోవడం నాకు ఎప్పటికీ నచ్చదు..
*********************************
written by BODDU MAHENDER
at 5:10pm 17.12.2012
No comments:
Post a Comment