Saturday, 22 December 2012

దురదృష్టం ..


నిజం.. దురదృష్టం అనేది ఒకటుంది..
అందుకే అదృష్టం అటకెక్కింది..
అవకాశం సన్నగిల్లింది..
అడుగు పడితే పాతాళం అవుతోంది..
 అన్నిటిలోనూ విషాదం నిండుతోంది..
కష్టం కన్నీటిలో కరుగుతోంది..
ఇష్టం నష్టమై  ఎదురీదుతోంది..
ఎందుకోసం పోరాడుతున్నానో.,
దాని ఫలితం నన్ను వెక్కిరిస్తోంది..
రాజీ లేని నా మార్గాన్ని బంధీ చేస్తోంది..
అయినా ఆపను..నా ఆశయం వీడను..
మీ హేళన నన్ను వేదించినా..,
నేననే భావనే రక్షిస్తోంది..
ఇది అహం కాదు ఆత్మ గౌరవం..
చరిత్ర నిర్మించే ముందు పూరిస్తున్న శంఖారావం..
******************************
written by BODDU MAHENDER
at 6:30pm 22.12.2012

No comments:

Post a Comment