Saturday, 3 November 2012

తన పుట్టిన రోజుకే.....


వికసించెను ఒక పుష్పం
విశ్వజనీన ప్రేమకి సాక్షిగా..
వెదజల్లెను తన పరిమళం
సర్వ మానవాళికి బోధగా..
తన మాట మృదు మధురం..
మనసు ఓ మకరందం.. 
అడుగు అభ్యుదయం..
ఆశ నిత్య నూతనం..
ఆ సాహితీ సుమమే..
ఈ మణి మాలిక..
తన పుట్టిన రోజుకే..
నా ఈ శుభాకాంక్షల గీతిక..
************************
written by BODDU MAHENDER
at 7:56pm 3.11.2012

No comments:

Post a Comment