Thursday, 29 November 2012

ఓ మై ల్యాపీ..!!


నా స్నేహం..నా ప్రాణం..
నా ఊహలకి జీవం.. 
అన్నీ నీతోనే కదా..
ఓ మై ల్యాపీ..!!
జ్ఞాపకానికే జ్ఞాపకం నీవు..
నా ఆలోచనలకి రూపకం నీవు..
క్షణమైనా నిన్ను వదలగలనా..
నీవు లేక నా పనులేవైనా చేయగలనా..
వ్యసనమనుకో..వ్యామోహమనుకో.. 
నీపైనే నేను ఆధారపడుతున్నాను అనుకో..
ఏమనుకున్నా..
నీవే నాకు మిన్న అని చెబుతున్నా..
నీతోనే నేను మిన్నగా ఎదిగానంటున్నా..
లవ్యూ మై ల్యాపీ..
నువ్వుంటే ఫరెవర్ నే హ్యాపీ..
***************************
written by BODDU MAHENDER
at 1:26pm 29.11.2012

No comments:

Post a Comment