Tuesday, 23 October 2012

వీడుకోలు వీడుకోలే బతుకమ్మా..


ఏటేటా నీ పూజలే బతుకమ్మా..
ఏటేటా నీ పాటలే బతుకమ్మా..
మా ఇంటి ఇలవేల్పువే బతుకమ్మా..
మా కంటి మేల్కొల్పువే బతుకమ్మా..
సల్లంగా మము చూడవే బతుకమ్మా..
సొంతంగా రాష్ట్ర మీయవే బతుకమ్మా..
మా యాస భాషలన్నీ బతుకమ్మా..
బతికించే తల్లి నీవే బతుకమ్మా..
ఈ కన్నీటి కాసారాన్ని బతుకమ్మా.
కనకమయం చేయవే బతుకమ్మా..
ఇక వీడుకోలు వీడుకోలే బతుకమ్మా..
వేడుకోలు మావి వినవే బతుకమ్మా..
************************
written by BODDU MAHENDER
at 8:42pm 23.10.2012

No comments:

Post a Comment