ప్రియాతి ప్రియమైన లేఖ కి, రాస్తున్నా..ఈ ప్రేమలేఖ..
నీకు ఎదురుగా నిలబడి చెప్పలేక..
నువ్వు నాకు నచ్చావ్..నువ్వంటే నాకిష్టం,నువ్వులేక నేను లేను..లాంటి సినిమాలన్నీ చూసి నేను కూడా లవ్ జేసుడు మొదలు పెట్టినా.. పాత సినిమాల సీడీలు చూసి లెటర్స్ రాసుడు సురువు జేసినా...నువ్వు నా మొదటి లవర్ కాకపోయినా నేను సైట్ వేసే ఆఖరి దానివి కావాలనుకుంటున్నా..
నిన్ను లగ్గం జేస్కోవాలని మనసులో పీకుతాంది..గందుకే గీ లెటర్ రాసి నిన్ను లైన్లో పడేయ్యాలని చూస్తున్నా.. నీకేం కావాలంటే అది కొనిస్తా.. ఊర్లన్నీ తిప్పిస్తా.. మస్త్ ఖుషి చేపిస్తా.. ఏమంటావ్ మరి.. ఇగో నేను అమితాబ్ బచ్చన్ అంత హైట్ లేకపోయినా..అమీర్ ఖాన్ లాంటి తీస్ మార్ ఖాన్ ని ..ప్రభాస్ అంతటి కండ లేకపోయినా..పారిపోయే టంతటి పిరికొన్ని అయితే కాదు.. జర ఆలోచించుకో మల్ల.. అప్పటికి కూడా ఇష్టం లేకపోతే గిది నీ దోస్త్ సమ్మక్క కి ఇచ్చేయ్.. పండగ జేసుకుంటా.. ఉంటా ఇగా..
నీకు లైన్ వేసే ఏడో పోరడు,
చెన్నూరు చిన్నోడు .
************************************
written by BODDU MAHENDERAt 9:40pm 31.10.2012
.
.
No comments:
Post a Comment