Saturday, 22 September 2012

అదే ఒక మాట......

నీవు నేను ఏకమని,
నీవే నా లోకమని..
నిదుర మరిచి నీ ఊహనే కంటినే..
నిరంతరం నీ ధ్యానమే చేస్తినే..

అయినా నా కల కలగానే మిగిలనే..
నీ కరుణ లేక నాలో కార్చిచ్చు రేగెనే..
వలపు మేఘాలన్నీ వంచించి పోయెనే..
వాంఛలన్నీ వడగండ్లై కురిసెనే...
మళ్ళీ..
అదే ఒక మాట మరి మరి వినిపించెనే..
గుచ్చి గుచ్చి ఈ గుండెకే గాయం చేసెనే..
అదృష్ట హీనుడని లోకం ఈసడించనే..
దురదృష్టానికి పరాకాష్టగా నన్ను చూపెనే..
**************************
written by BODDU MAHENDER
at 8:08pm 16.9.2012

No comments:

Post a Comment