హేళన,వితండ వాదన అనుకున్నా..
వేదన,నాకో యాతన అవుతుందనుకోలేదు..
అన్నీ వస్తాయనే ఆశతో,
అహరహం శ్రమించినా..
అందరూ నా వాళ్లేనని
అనుక్షణం ప్రేమించినా..
కరకు మాటల కోతలే మిగిలాయి..
కన్నీటి సుడుల వెతలే నిలిచాయి..
తొలిసారి.. నాపై నేను
నమ్మకం కోల్పోయిన క్షణమది...
నా ఆశయాల్ని నీరుగార్చిన ఘటనది.
విధి చేతిలో బంధీనని
విముక్తిలేని బానిసనని
అపుడే నాకు తెలిసొచ్చింది..
అసహాయుడినని గుర్తొచ్చింది..
ఇక ఇపుడు నాకు నేనే అనుకుంటున్నా..
నేనొక దురదృష్టవంతుడిని అని.
**********************
written by ME
at 11:40pm 5.8.2012
No comments:
Post a Comment