రోజూ రోజా చేస్తూ..
దానం ధర్మం చేస్తూ
రంజాన్ మాసం అంతా
ఖురాన్ గ్రంథం పఠిస్తూ..
నమాజ్ ప్రార్థనలో అంతా..
అల్లాహ్ కరుణకై తపిస్తూ..
సాటివాడి సంతోషానికే
సమయాన్ని అంతా వెచ్చించి
సత్యం, సహనం ,సమభావనలకే
సదా సలాం అని జై కొట్టి
సంబరాల ఈదుల్ ఫితర్ ని
సంతోషంగా జరుపుకునే
మహ్మదీయ మిత్రులందరికీ
ముబారక్ ..ఈద్ ముబారక్
******************
written by ME
at 8:30am 20.8.2012
No comments:
Post a Comment