ఇన్నాళ్ళు ఏకాంతం అనుకున్నది
ఇప్పుడు ఏకాకితనం అయింది
కలవరింతల సడి కాస్తా
కలతల తడి నింపింది
నా ఎదురు చూపులకిక ఆశ లేదు
ఐనా, తాను తప్ప వేరే ధ్యాస లేదు
ప్రేమా..
నీ ఊహలో ఏదో మాయ ఉందే..
కనపడని మనసుని కట్టిపడేసే శక్తి ఉందే..
మరి,కానరాని నా ప్రియుడిని కలనైనా చూపించవే..
కలకాలం ఆ గుర్తుల్ని గుండెల్లో నింపేయవే...
****************************
written by
BODDU MAHENDER
at 9:05am 13.7.2012
No comments:
Post a Comment