ఎవరో...
కన్నీటి కొలనుకి గండి కొడుతున్నారు..
మరిచిపోయిన మనసుని గుర్తు చేస్తునారు..
నిదరోయిన ప్రేమని తట్టి లేపుతున్నారు..
చనిపోయిన ఆశకి ఊపిరి ఊదుతున్నారు..
మరి ఎవరో..
శిథిలమైన మానసవీణని శృతి చేస్తున్నారు..
పదిలమైన అనురాగాలని పలికిస్తున్నారు..
హరివిల్లుల ఆకాశాన్ని చూపిస్తున్నారు..
ఆనందాలకి దారి తీస్తున్నారు..
ఎవరో..అది ఎవరో..గాని
జ్ఞాపకాల వెలుగుని చూపిస్తున్నారు..
నవ్వుల నావని పంపిస్తున్నారు..
కళ తప్పిన జీవిత సంద్రంలో
కలల అలలని సృష్టిస్తున్నారు..
**************************
written by ME
at 8:04am 8.6.2012
No comments:
Post a Comment