Sunday, 3 June 2012

అనురాగశీలి నైజం..

ఆస్తుల అంతరాలు చూసేచోట..
అంతరంగాలకి విలువ లేదు..
అంతస్తులు అడ్డు గోడలైన చోట..
ఆత్మీయతలకి తావు లేదు..

అనుబంధం నమ్మకమైతే..
ఆజన్మం నీ తోడై ఉంటుంది..
అనుకోని ఆపదలొచ్చినా
అండగా నిలిచే ఉంటుంది..

అంతులేని సంపదలున్నా..
ఆకలి మానవ సహజం..
అవని నేలె అధికారమున్నా..
ఆదరించే మనసు కోరుటే 
అనురాగశీలి నైజం..
*****************
written by ME
at 8:02pm 3.6.2012

No comments:

Post a Comment