Sunday, 13 May 2012

అమ్మ అంటే...


రాసేందుకు ఎంతో ప్రయత్నించా..
రాయలేనని తెలుసుకొని 
ఇలా తలవంచా..
అనంత అర్ధాల్ని పొదిగిన అమ్మ తత్వాన్ని..
ఈ అతికొద్ది అక్షరాల్లో అలంకరించలేక...
ఆవేదనగా మీ ముందు నిలిచా..

ఎందుకో అమ్మ అంటే...
అంతులేని భావావేశాలు పొంగుకొస్తాయి...
అర్థంకాని పిచ్చి ప్రేమలు..గుర్తుకొస్తాయి..
త్యాగానికి రుజువులు కళ్ళ ముందు నిలుస్తాయి..
తన్మయత్వంతో మదిని పరవశింపజేస్తాయి..

కాలమెంత మారినా..అమ్మ మనసు మారలేదు..
ఎంత బాధకోర్చయినా..అమ్మగా అయ్యే ఆరాటం తగ్గలేదు..

ప్రేమకి రూపం మగువ అయితే..
దానికి పరిపూర్ణత-అమ్మే కదా..

అన్నీ తానే అయి అర్పితమయ్యేది..
అఖిల జగత్తుకి కారణమయ్యేది..
ఆత్మేయతకి అర్థం తెలిపేది..
అనుబంధాలకి వారధిగా మారేది..
ఒక్క అమ్మే కదా..
****************************
అమ్మ..

అమృతం వంటి ప్రేమకి...
అతివ ఇచ్చే అమూల్య రూపం..
*****************************
written by ME
at 6:06pm ,13.5.2012

1 comment: