రక్తం ఇగిరినా..
కండలు తరిగినా..
గాయాలయ్యి..,దేహం సలిపినా
అదే పని యావ
ఒంట్లో తగ్గని స్థిర చేవ
చాకిరీ పెట్టినా
బానిస చేసినా
భారాలు మోపి బాధ్యతలన్నా
అదే కృతజ్ఞత - గుండెల్లో
చిత్త శుద్ధి ,చేసే వారి పనుల్లో..
అయినా,,
వారి బ్రతుకు చిత్రం మారలేదు
పిడికెడు మెతుకులకై ఆత్రం తగ్గలేదు
కలలన్నీ కన్నీటిలో పారినా
స్వేదమై కరగడం ఆపలేదు..
విలాసాలు మనకిచ్చి
విధి వంచితుడవుతున్న ఓ కష్టజీవి ..
వందనం..నీకు వేవేల వందనం..
***********************
written by ME
at 9:25am 1.5.2012
కార్మికుల దినోత్సవ(మే డే ) శుభాకాంక్షలు ..
chala bagundi i am a fan for your poetry from this time
ReplyDelete