Tuesday, 8 May 2012

క్షమించు..నేస్తం..క్షమించు..

ఎదుట నిలబడలేక వెళ్ళిపోతున్నా..
ఎదలోని ప్రేమని ఎడబాపి పోతున్నా..
నాకు తెలుసు ఇది వంచన అని..
నన్నే నమ్మిన నీ హృదయానికి వధ్యశిల అని...
కానీ.......
నాకు మాత్రమే తెలుసు ఇదొక త్యాగం అని...
నీకై నేనర్పిస్తున్న నా ప్రాణం అని..

కాలం చేసిన గాయం..
కట్టుబాట్ల మధ్య నలిగిన నా ప్రాయం..
నీ ఊహలకి సరిపడవని..
నీ ఆశలని తీర్చలేవని తెలిసి....
భారమైన గుండెలతో 
ఈ లోకానికి దూరమై పోతున్నా ..
నీ ఎదుట నిలబడలేక.. 
నిన్నే 
విడిచి నే.. పోతున్నా....

వెళ్ళిపోతున్నా..నేస్తం..వెళ్ళిపోతున్నా..
తిరిగిరాని లోకాలకి తరలి పోతున్నా..
నీలో చెరగని ఓ జ్ఞాపకమై మిగిలిపోతున్నా...
క్షమించు..నేస్తం..క్షమించు..
నీ ఈ దాసిని మన్నించు....
*****************************
written by ME
at 9:43am 9.5.2012

1 comment:

  1. గుండెను పిండేస్తుంది మీ కవిత... చాలా బాగుంది... మహేందర్ గారు
    నాకు ఏడుపు ఆగడం లేదు....

    ReplyDelete