Monday, 14 May 2012

ఆడపిల్లననా....???


చుట్టూ ఎంతో జనం..
మరెంతో అభిమానం..
అయినా మీరక్కడికి రారు..
ఓ మూల నుంచైనా దాన్ని చూడరు..
హాలంతా జయజయధ్వానాలు..
అతిరథ మహారథుల హర్షాతిరేకాలు..
అయినా మీకివేం పట్టవు..
మీ బిడ్డగా నన్ను చెప్పుకోరు..


అందరూ ఏదో సాధించానని పొగుడుతున్నారు..
కాని నేను కోల్పుతున్నదెంతో వారికేం తెలుసు..?


జగమంతా జేజేలు కొట్టినా..
మీరొక్కసారి వెన్నుతట్టిన సందర్భమే లేదు..
లోకమంతా వేనోళ్ళ పొగిడినా,,
మనసారా మీ దగ్గరికి చేర్చుకున్నదే లేదు..


ఎందుకు నాన్నా...??
ఆడపిల్లననా....అందవికారిననా..???
అన్నయ్య ఆవగింజంత చేసినా..
ఆకాశానికి ఎత్తే మీరు..
నన్ను మాత్రం...
ఓ అంటరాని దానిలా...
ఆజన్మ బానిసలా చూస్తారెందుకు...?


ఆడపిల్లగా పుట్టడమే నే చేసిన నేరమా..?
అవిటిదాన్ని అవ్వడం నా పాలిట శాపమా..?
***********************
written by ME
at 9:55am 15.5.2012

1 comment: