Monday, 23 April 2012

మనిషిని అనుకుంటూ..

రాని నవ్వులని తెచ్చుకొని,
లేని ప్రేమలని పంచుకొని,
అవసరాలకే బంధాలని వాడుకొని,
అన్నిటినీ డబ్బుతో ముడి పెట్టుకొని,

నిన్ను నీవే మైమరిచి,
ఇతరుల కోసం నీ మదిని హీన పరిచి,
నీ ఉనికిని కూడా అస్థిత్వ పరిచి ,
పేరు ప్రతిష్ట లకే విలువిచ్చి..

మనిషిని  అనుకుంటూ 
మర యంత్రమై పోతున్న ఓ మానవుడా...
మానవతకి ఇక  అర్థమేదిరా మూర్ఖుడా  

ప్రగతి అంటే నీ కీర్తిని చాటే  విజయం కాదు ..
నీ వ్యక్తిత్వాన్ని చూపే సూచిక
సాంకేతికత అంటే నీ పని తేలిక చేసే బుద్ధి కుశలత కాదు..
సాటి వారి వేదనకి నీవు ఇచ్చే సాంత్వన..

ఇది అర్ధమైతే నీవే మనుషుల్లో మనీషివి..
మహా తేజోసంపన్నమైన  మహర్షివి ..
********************
written by ME
at 1:06pm , 23.04.2012
********************
 ఈ కవిత సూర్య దిన పత్రిక ప్రధాన సంచికలో 30.4.2012నాడు సాహితీ గవాక్షం శీర్షికలో ప్రచురితమైంది.

No comments:

Post a Comment