Wednesday, 7 March 2012

సమానత్వాన్ని ప్రతిపాదించు...

అణకువ పేరుతో అణిచివేసినా ,
వినయం పేరుతో విచ్చలవిడితనాన్ని భరించమన్నా..
కడుపు మాడ్చినా..,కష్టాలకి ఎదురీడ్చినా,
ఆశలన్నీ చంపుకొని,
అస్తిత్వాన్ని కోల్పోయినా..
ఆఖరికి తన దేహంతో ఆడుకున్నా..
అన్నీ మరచి నిను ప్రేమిస్తూనే ఉంది అతివ..
అనురాగంతో పలికే చిన్ని మాటకే,
మురిసిపోతుంది మగువ

పశుపక్ష్యాదుల్ని సైతం
ప్రేమించే ఓ నరుడా..
నీ పుట్టుక,ఎదుగుదలకి కారణమైన
మగువని మరిచావేమిరా ..మానవుడా..??

స్త్రీని ప్రేమించు..పూజించు..
సాటి మనిషిగా ఆరాధించు..
సమానత్వాన్ని ప్రతిపాదించు...
*********************
written by Boddu Mahender
at 5:57pm 7.3.2012

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

No comments:

Post a Comment