Saturday, 10 March 2012

నాలో నేనే అంతమవుతూ,


నేను నవ్విస్తున్నానా.?
నవ్వుల మాటున వాపోతున్నానా..?
కంటిలో చెమ్మ ఆరదు..
పెదాలపై నవ్వు చెరగదు.
గుండె మంటని ఆర్పేందుకు ,
ఒక్క కన్నీటి చుక్కైనా కిందికి జారదు..
ఆత్మ ఘోష వినిపించేందుకు ,
ఒక్కసారైనా పెదవి కదలదు..
అందుకే,
నాలో నేనే అంతమవుతూ,
మీ నవ్వుల కోసం అర్పితమవుతూ,
భరించలేని వేదనలో,
భారంగా గడిపేస్తున్నా..
నిరాశ, నిస్పృహలే తోడుగా..
నిస్సహాయంగా నిట్టూరుస్తున్నా..
*******************
written by ME
at 12:50am 10.3.2012 

No comments:

Post a Comment