Friday, 6 January 2012

యమలీల సినిమా లోని "సిరులొలికించే చిన్ని నవ్వులే" పాట




యమలీల సినిమా లోని "సిరులొలికించే
చిన్ని నవ్వులే" పాట



పల్లవి :

సిరులొలికించే
చిన్ని నవ్వులే
మణిమాణిక్యాలు
చీకటి ఎరగని
బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే
తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దు మాటలే

మా ధనధాన్యాలు
ఎదగాలీ ఇంతకు ఇంతై
ఈ పసికూనా
ఏలాలీ ఈ జగమంతా ఎప్పటికైనా
మహారాజులా జీవించాలి
నిండునూరేళ్లూ ॥
జాబిల్లి జాబిల్లి జాబిల్లి
మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి
చరణం : 1

నాలో మురిపెమంతా
పాల బువ్వై పంచనీ
లోలో ఆశలన్నీ
నిజమయేలా పెంచనీ
మదిలో మచ్చలేని
చందమామే నువ్వనీ
ఊరూవాడ నిన్నే
మెచ్చుకుంటే చూడనీ
కలకాలమూ కనుపాపల్లే కాసుకోనీ
నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ

చరణం : 2

వేశా మొదటి అడుగు
అమ్మ వేలే ఊతగా
నేర్చా మొదటి పలుకు
అమ్మ పేరే ఆదిగా
నాలో అణువు అణువు
ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకోనా
అమ్మ ఋణమే తీరగా
తోడుండగా నను దీవించే కన్నప్రేమ
కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా

చిత్రం : యమలీల (1994)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
గానం : కె.ఎస్. చిత్ర, ఎస్.పి.బాలు



No comments:

Post a Comment