Sunday, 29 January 2012

స్నేహితుడు (2012 )

పల్లవి :
మన  ఫ్రెండల్లె  ఇంకేవడుంటాడు
జనమందర్లో  తానొకడేం    కాడు
మన  గుండెల్లోనే  ఉన్న  వాడు
కను  పాపలకెందుకు  ఎదురై  రాడు
మన  నవ్వుల్లో  నమ్మకమే  వాడు
మరి  చెంపలకెందుకు  చెమ్మయ్యాడు
మన  ఫ్రెండల్లె  ఇంకేవడుంటాడు
జనమందర్లో  తానొకడేం    కాడు
మన  గుండెల్లోనే  ఉన్న  వాడు
కను  పాపలకెందుకు  ఎదురై  రాడు
మన  నవ్వుల్లో  నమ్మకమే  వాడు
మరి  చెంపలకెందుకు  చెమ్మయ్యాడు 


చరణం :
నిన్నటి  దారిని  ప్రశ్నిస్తాడు
తానే  రేపటి  బాటని  సృష్టిస్తాడు
నిద్దుర  మాటున  దాక్కోలేడు
మన  కలలకు  పగటిని  చూపిస్తాడు
బ్రతకడమో  అద్బుతం  అంటూ
ప్రతి  నిమిషం  జీవిస్తాడు
తన  లాగే  జీవించేట్టు
మన  దారే  మార్చేసాడు
నలు  దిక్కులు  చెరిపే  రాకకై  వాడు
సూరీడికి  తూరుపు  దిక్కవుతాడు
మన  సూర్యుడు  తానై  వెలిగినవాడు
ఏ  మబ్బుల  చాటున  దాక్కున్నాడు
మన  ఫ్రెండల్లె  ఇంకేవడుంటాడు
జనమందర్లో  తానొకడేం    కాడు
మన  గుండెల్లోనే  ఉన్న  వాడు
కను  పాపలకెందుకు  ఎదురై  రాడు
మన  నవ్వుల్లో  నమ్మకమే  వాడు
మరి  చెంపలకెందుకు  చెమ్మయ్యాడు 


చిత్రం :స్నేహితుడు (2012 )
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: క్రిష్ , సుచిత్ సురేసన్ 
సంగీతం : హరీష్ జైరాజ్ 
దర్శకత్వం : శంకర్ 

No comments:

Post a Comment